(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారత క్విజ్ ప్రశ్నలు & సమాధానాలు

ఆది పర్వము

సభాపర్వము

అరణ్యపర్వము

విరాటపర్వము.

ఉద్యోగపర్వము

భీష్మపర్వము

ద్రోణపర్వము

కర్ణపర్వము.

శల్యపర్వము

సౌప్తికపర్వము

స్త్రీపర్వము

శాంతిపర్వము

అనుశాసనిక

అశ్వమేధ పర్వము

ఆశ్రమ వాస పర్వము

 మౌసల పర్వము

మహాప్రస్థానిక పర్వం

స్వర్గారోహణపర్వం

శ్రీ మహాభారతంలో శ్లోకములు

మనకు గల అన్ని పురాణములలో, ఇతిహాసములలొ ముఖ్యమైనది మహాభారతం. తెలుగులో మన పెద్దలు తరచుగా అనే మాట " తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి". 

మనకు తెలిసినంత వరకు భారతం 18 సంఖ్యకు ప్రాముఖ్యతను ఇచ్చినది. ఇందులో ఏది చూసినా 18. దీనిలోని పర్వములుకూడా 18. ఇప్పుడు వాటి పేర్లు వానిలోగల శ్లోకముల సంఖ్యలు తెలుసుకుందాం!

  1. ఆదిపర్వం - 9984 శ్లోకములు,

  2. సభాపర్వం - 4311 శ్లోకములు,

  3. అరణ్య పర్వం - 13664 శ్లోకములు,

  4. విరాటపర్వం - 3500 శ్లోకములు,

  5. ఉద్యోగ పర్వం - 6998 శ్లోకములు,

  6. భీష్మ పర్వం - 5884 శ్లోకములు,

  7. ద్రోణ పర్వం - 10919 శ్లోకములు,

  8. కర్ణ పర్వం - 4900 శ్లోకములు,

  9. శల్య పర్వం - 3220 శ్లోకములు,

  10. సౌప్తిక పర్వం - 2870 శ్లోకములు,

  11. స్త్రీ పర్వం - 1775 శ్లోకములు,

  12. శాంతి పర్వం - 14525 శ్లోకములు,

  13. అనుశాసనిక పర్వం - 12000 శ్లోకములు,

  14. అశ్వమేధ పర్వం - 4420 శ్లోకములు,

  15. ఆశ్రమవాస పర్వం - 1106 శ్లోకములు,

  16. మౌసల పర్వం - 300 శ్లోకములు,

  17. మహా ప్రస్థాన పర్వం - 120 శ్లోకములు,

  18. స్వర్గారోహణ పర్వం - 200 శ్లోకములు,

అన్ని కలిపితే మనకు మహాభారతం లో మొత్తం 1,00,696 శ్లోకములు ఉన్నాయి.

పద్యం ;
గీతాశ్రయోహం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్‌,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాంపాలయామ్యహవ్‌'. ||

నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతా జ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

మహాభారతంలోని పాత్రలు

ద్రౌపది పతివ్రత రహస్యం

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.